అల్లరి నరేష్(Allari Naresh) వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. తనలోని కొత్త నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. నాంది సినిమా(Naandi Movie)తో అల్లరి నరేష్ కు కమర్షియల్ హిట్ లభించింది. తాజాగా ఆయన మార్కెట్ పెరిగింది. నాంది సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల(Vijay Kanakamedal)తోనే ఉగ్రం సినిమా(Ugram Movie) చేస్తున్నాడు. థ్రిల్లర్ కథాంశంతో వస్తోన్న ఈ సినిమా మే 5వ తేదిన విడుదల కానుంది. సినిమా రిలీజ్ దగ్గర పడటంతో అల్లరి నరేష్ వరుస ప్రమోషన్లతో బిజీ అయిపోయాడు.
ఉగ్రం సినిమా(Ugram movie) ప్రమోషన్ లో భాగంగా తాజాగా అల్లరి నరేష్(Allari Naresh) కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. మూవీలోని ఓ ఫైట్ సీన్ కోసం నరేష్ నాలుగు రోజుల్లోనే 500 వరకూ సిగరెట్లు తాగాడు. ఈ విషయాన్నీ ఇటీవలె ఓ ఇంటర్వ్యూలోనూ తెలిపాడు. దగ్గు, జ్వరంతో పాటుగా ఆరోగ్యం కూడా ఆ సమయంలో దెబ్బతిందని, ఆ సీన్ కోసం అంత రిస్క్ చేశానని చెప్పి అందరికీ షాకిచ్చాడు.
అల్లరి నరేష్(Allari Naresh) ప్రమోషన్లలో చెప్పిన మాటలకు పలువురు నెటిజన్లు ఆయన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. డెడికేషన్ అంటే నీదే నరేష్ అంటూ కామెంట్ చేశారు. ఉగ్రం సినిమా(Ugram Movie) నుంచి ఇప్పటి వరకూ రిలీజ్ అయిన టీజర్(Teaser), ట్రైలర్లు(Trailer) మూవీపై అంచనాలను పెంచేశాయి. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నరేష్ కు జోడీగా మిర్నా మీనన్ కనిపిస్తోంది. ఈ మూవీకి అబ్బూరి రవి(Abboori Ravi) మాటలు రాయగా, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందించాడు.