అన్ స్టాపబుల్ పేరుతో ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా టాక్ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఆ షో తొలి సీజన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. రెండో సీజన్ కూడా ఫినాలేకు చేరుకుంది. ఫైనల్ ఎపిసోడ్స్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ రానున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ ప్రోమోలు విడుదలయ్యాయి. అవి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి.
ప్రభాస్ ఎపిసోడ్ రిలీజ్ కాగానే ఆహా క్రాష్ అయిపోయింది. ఇక.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రిలీజ్ అయితే ఆహా సైట్ తట్టుకోగలదా అంటూ ఇప్పటికే నెటిజన్లు కామెంట్లు చేస్తున్న తరుణంలో ఆహా సర్వర్ల కెపాసిటీని పెంచి మరీ ఒకేసారి 2 మిలియన్ల మంది యూజర్లు అంటే 20 లక్షల మంది యూజర్లు లాగిన్ అయినా కూడా తట్టుకునేలా సర్వర్లను అప్ గ్రేడ్ చేశారట.
అలాగే.. ఆహాలో ప్రసారం అయ్యే షోలు కానీ.. అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ కానీ.. చాలామంది డౌన్ లోడ్ చేసి వాటిని ఇతర వెబ్ సైట్స్ లో పెడుతున్నారట. అటువంటి వెబ్ సైట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, పైరసీ చేసే వారిపై ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెడతామని ఆహా టీమ్ తాజాగా వెల్లడించింది. దీనిపై ప్రెస్ మీట్ నిర్వహించిన ఆహా టీమ్.. ఫిబ్రవరి 2 న రాత్రి 9 గంటలకు పవన్ కళ్యాణ్ తొలి ఎపిసోడ్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపింది. రెండో ఎపిసోడ్ అంటే అన్ స్టాపబుల్ 2 సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ను ఫిబ్రవరి 10 న రిలీజ్ చేయనున్నారు. సో.. ఇంకెందుకు ఆలస్యం.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. గెట్ రెడీ ఫర్ రికార్డ్ బ్రేక్.