ప్రస్తుతం యంగ్ హీరో అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో విలక్షణమైన క్యారెక్టర్స్ చేసిన శేష్.. ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. క్షణం.. అమీతుమీ.. గూఢచారి.. ఎవరు.. మేజర్ సినిమాలతో అలరించాడు. ఇక ఇప్పుడు ‘హిట్-2’ మూవీతో మరో సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్ ది సెకండ్ కేస్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం విజయంతో అడివి శేష్ డబుల్ హట్రిక్ సొంతం చేసుకున్నాడు. దాంతో అప్ కమింగ్ ఫిల్మ్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘గూఢచారి’ మూవీకి సీక్వెల్ చేయబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. అయితే మధ్యలో మిగతా కమిట్మంట్స్ కారణంగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం శేష్ చేతిలో కొత్త సినిమాలేవి లేవు. కానీ హిట్3లో నానితో పాటు శేష్ కూడా కనిపించనున్నాడు. అలాగే ఇప్పుడు ‘గూఢచారి-2’కి రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా స్క్రిప్ట్ పనులను మొదలు పెట్టినట్లు సమాచారం. అయితే మేజర్ మూవీ తర్వాత శేష్, శశి మధ్య విభేదాలు వచ్చాయని వార్తలొచ్చాయి. కానీ తాజాగా ‘గూఢచారి’ సీక్వెల్‌ను శశి కిరణే తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇక అడివి శేష్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని.. ‘గూఢచారి-2’కి పాన్ ఇండియా టచ్ ఇవ్వబోతున్నారట. త్వరలోనే ఈ సినిమా సైట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. మరి గూఢచారి సీక్వెల్ ఎలా ఉంటుందో చూడాలి.