ఆదిపురుష్ టీజర్‌కు ఆడియెన్స్ ఇచ్చిన రెస్పాన్స్తోనే.. ఇప్పుడు తాను ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు ఓం రౌత్ చెబుతున్నాడు.గతంలో రిలీజ్ చేసిన ఆదిపురుష్ టీజర్ నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదో యానిమేషన్ సినిమాలా ఉందని అన్నారు. కానీ ఇప్పుడు ఆదిపురుష్ గ్రాఫిక్స్.. మునుపటి కంటే బెటర్ అని అంటున్నారు. రీసెంట్గా ఈ సినిమా నుంచి జై శ్రీరామ్ అనే లిరికల్ మోషన్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇక ట్రిబెకా ఫెస్టివల్‌లోను ఆదిపురుష్ చోటు దక్కించుకొని అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. అందుకే ఇప్పుడు ఓం రౌత్ హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఓం రౌత్ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది ఆరంభంలోనే సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నాం.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల జూన్‌కు వాయిదా వేశాం.
దీంతో గ్రాఫిక్స్ కోసం ఇంకో ఆరేడు నెలలు కలిసి వచ్చింది. ఈ సమయంలో విజువల్ ఎఫెక్ట్స్(Visual effects) స్టూడియోస్ మరింత బెటర్ అవుట్ పుట్ ఇచ్చేందుకు ట్రై చేశాయన్నారు. అలాగే డీసీ కామిక్స్, మార్వెల్ మూవీస్, అవతార్ రేంజ్లో.. ‘ఆదిపురుష్’ కోసం కొత్త టెక్నాలజీని వాడాం. ఖచ్చితంగా ఆదిపురుష్ చూసినప్పుడు ఓ భారీ హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి అందిస్తుందన్నారు. ఇక ఇప్పుడు ఆడియెన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్‌తో సంతోషంగా ఉందని అన్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. జూన్ 16న రిలీజ్ చేయబోతున్నారు. కృతిసనన్ (Kritisanan) సీతగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) రావణాసురుడి పాత్రలో నటించాడు. ఏదేమైనా ఆదిపురుష్ పై ఓం రౌత్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడనే చెప్పాలి.