»Vishal Supports Trisha After Former Aiadmk Members Disgusting Comment
Trisha : త్రిషపై నోరు పారేసుకున్న నేత.. ఆమెకు మద్దతుగా నిలిచిన విశాల్
ప్రముఖ నటి త్రిషపై ఏఐడీఎంకే పార్టీ నేత ఏవీ రాజు అనవసరంగా నోరుపారేసుకుని ఇరుక్కుపోయారు. ఆ వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని త్రిష వెల్లడించగా, ఆమెకు హీరో విశాల్ సైతం మద్దతుగా నిలిచారు.
Vishal supports Trisha : తెలుగు, తమిళ సినిమాల్లో ప్రముఖ నటిగా రాణిస్తున్న హీరోయిన్ త్రిష. ఇటీవల ఆమెపై ఏఐడీఎంకే పార్టీ నేత ఏవీ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఎమ్మెల్యే అడిగితే కొంత మొత్తానికి త్రిషను రిసార్టుకు తీసుకు వెళ్లానని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయంపై త్రిష సీరియస్‌గా స్పందించారు. త్రిషతో పాటుగా నటుడు విశాల్ కూడా దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.
‘ఓ రాజకీయ పార్టీకి చెందిన ఓ స్టుపిడ్, ఇడియట్ మా సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తి గురించి దారుణంగా మాట్లాడవని నాకు ఇప్పుడే తెలిసింది. నేను నీ పేరు, నువ్వు టార్గెట్ చేసిన వ్యక్తి పేరు ఇక్కడ చెప్పను. ఎందుకంటే నువ్వు ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్నారు. అలాగే మా సినిమా ఇండస్ట్రీ వాళ్ల పేర్లను అసలే చెప్పను. మేమంతా మంచి స్నేహితులం. పరస్పరం గౌరవించుకుంటాం. నువ్వు చేసినది చాలా మురికి పని. ఆ మాటలనూ ఇక్కడ ప్రస్తావించలేను. నీ కామెంట్స్‌ని ఖండిస్తున్నా అనీ చెప్పలేను. ఎందుకంటే అది చాలా చిన్న మాట. కానీ నువ్వు నరకానికి వెళతావు’ అంటూ విశాల్(Vishal) ట్వీట్ చేశారు.
ఈ విషయంపై నటి త్రిష కూడా చాలా సీరియస్‌గా స్పందించారు. ఇలాంటి మనుషులను చూస్తుంటే అసహ్యం వేస్తోందని అన్నారు. ఆ నేతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. పబ్లిసిటీ కోసం వీళ్లు ఎంతకైనా దిగజారి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక నుంచి చట్టపరమైన చర్యలే ఉంటాయంటూ త్రిష ట్వీట్ చేశారు. ఈ వివాదం మరింత ముదురుతుండటంతో ఏవీ రాజు ప్రెస్‌మీట్ పెట్టి మరీ క్షమాపణలు చెప్పారు. త్రిష(Trisha ) లాంటి యువ నటీమణులు అని అన్నాను తప్ప ఆమెనే అనలేదని చెప్పుకొచ్చాడు. తన మాటల్ని తప్పుదోవ పట్టించారంటూ చెప్పుకొచ్చారు. త్రిషతోపాటు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరికీ క్షమాపణ చెబుతున్నానని అన్నారు.