»Actor Ajith Kumar Helps Woman Travelling With A Toddler At Glasgow Airport
Airportలో ఒక పనితో మరోసారి మనసులు దోచేసిన హీరో అజిత్
మిళ ప్రజలకు కష్టమొస్తే మేమున్నామని కదిలి వస్తారు. అందుకే ఆ హీరోలంటే తమిళ తంబీలు ప్రాణమిస్తారు. వారికి గుళ్లు కట్టి పూజలు చేస్తారు. ‘అజిత్ సార్ గ్రేట్... మీరు సూపర్ సార్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తమిళనాడు హీరోలు ప్రత్యేకతతో ఉంటారు. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. తమిళ ప్రజలకు కష్టమొస్తే మేమున్నామని కదిలి వస్తారు. అందుకే ఆ హీరోలంటే తమిళ తంబీలు ప్రాణమిస్తారు. వారికి గుళ్లు కట్టి పూజలు చేస్తారు. తాజాగా అగ్ర హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) తన చర్యతో ప్రజల మనుసులు గెలుచుకున్నారు. ఓ అభిమాని బ్యాగ్ (Luggage Bag)ను విమానం దాకా మోసుకెళ్లాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లండన్ ఎయిర్ పోర్టులో (London Airport) హీరో అజిత్ వచ్చాడు. అతడిని చూసిన ఓ మహిళ (Young Lady) తన పది నెలల బిడ్డతో కలిసి పరుగెత్తుకుంటూ వచ్చి ‘సెల్ఫీ సర్’ అని అడిగింది. ఆమెను కాదనలేక అజిత్ సెల్ఫీ ఫొటో (Selfie) దిగాడు. అయితే ఆమె బ్యాగ్ మోయలేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని హీరో గ్రహించాడు. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకుని ఇద్దరు ప్రయాణించేది ఒకే విమానం (Flight) అని తెలుసుకున్నాడు. దీంతో ఆమెకు సహాయంగా విమానం దాకా ఆ మహిళా బ్యాగ్ ను హీరో అజిత్ మోశాడు. దీనిపై మహిళ భర్త సోషల్ మీడియాలో (Social Media) పంచుకున్నాడు.
‘నా భార్య పది నెలల బాబుతో ఒంటరిగా గ్లాస్గో (Glasgow) నుంచి చెన్నై (Chennai) ప్రయాణం చేసింది. లండన్ విమానాశ్రయంలో హీరో అజిత్ ను కలిసే అవకాశం దొరికింది. ఆ సమయంలో నా భార్య బాబుతో పాటు రెండు చేతుల్లో ట్రావెల్ సూట్ కేసు, బేబీ బ్యాగ్ ఉంది. ఆమె ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన అజిత్ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. నా భార్య చేతిలోని బేబీ బ్యాగ్ ను తీసుకున్నారు. వద్దన్నా వినలేదు’ అని అతడు ఓ లేఖలో పేర్కొన్నాడు. ‘నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ఆ ఇబ్బందులు ఏమిటో నాకు తెలుసు’ అని అజిత్ అన్నారని తెలిపాడు. ‘అంత పెద్ద స్టార్ హీరో అయ్యి ఉండి కూడా ఎంతో సాధారణంగా వ్యవహరించారు. ఇది నన్నెంతో ఆకట్టుకుంది. ఆయన చాలా గొప్ప మనిషి’ అని ఆమె భర్త ఆ పత్రంలో పేర్కొన్నాడు. ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియాలో అజిత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘అజిత్ సార్ గ్రేట్… మీరు సూపర్ సార్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.