»Wakayama Japan Pm Fumio Kishida Evacuated After Smoke Bomb Explosion
జపాన్ ప్రధాని Fumio Kishidaపై బాంబు దాడి.. త్రుటిలో తప్పిన ప్రమాదం
. ప్రధాని సభలో ఈ సంఘటన చోటుచేసుకోవడం భద్రతా సిబ్బందికి సవాల్ గా మారింది. ప్రముఖులే లక్ష్యంగా ఇటీవల దాడులు జరుగుతున్నాయి. జీ-7 దేశాల మంత్రుల సమావేశాలు జరగనున్న వేళ ఈ సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
ఓ సమావేశంలో పాల్గొన్న జపాన్ (Japan) ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు (Fumio Kishida)తృటిలో ప్రమాదం తప్పింది. బాంబు దాడిలో (Bomb) తప్పించుకోవడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమం వేదిక వద్ద ఓ వ్యక్తి బాంబు వేశాడు. అప్రమత్తమైన అధికారులు చాకచక్యంగా వ్యవహరించి వెంటనే ప్రధానిని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
వకయామా (Wakayama) నగరంలో శనివారం ప్రధాని ఫుమియో కిషిదా పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ సమావేశంలో ప్రధాన వేదికకు సమీపంలో బాంబు పేలుడు (Bomb Blast) సంభవించింది. శబ్ధంతో పేలుడు సంభవించడంతో అక్కడ ఉన్న వారంతా ఉరుకులు పరుగులు పెట్టారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది (Security Forces) వెంటనే ప్రధానిని చుట్టుముట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు. లిబరల్ డెమెక్రటిక్ పార్టీకి (Liberal Democratic Party) చెందిన ప్రతినిధితో మాట్లాడుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. అయితే ప్రధానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు ధ్రువీకరించారు. కాగా, గతేడాది జూలై 22వ తేదీన మాజీ ప్రధాని షింజో అబేను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే.
ఘటనా స్థలం నుంచి ఓ యువకుడు పారిపోతుండగా భద్రతా సిబ్బందిని పట్టుకున్నారు. ఆ యువకుడు ప్రధాని ఉన్న వేదికపై స్మోక్ బాంబును విసిరినట్లు అధికారులు తెలిపారు. ప్రధాని సభలో ఈ సంఘటన చోటుచేసుకోవడం భద్రతా సిబ్బందికి సవాల్ గా మారింది. ప్రముఖులే లక్ష్యంగా ఇటీవల దాడులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో జపాన్ లో జీ-7 దేశాల మంత్రుల సమావేశాలు జరగనున్న వేళ ఈ సంఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆ సమావేశంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.