»Whatsapp Introduces New Security Features For Account Protect Device Verification Among Others
WhatsAppలో ఇక చాటింగ్ భద్రం.. మనల్ని కాదని ఎవరూ ఏం చేయలేరు
వాట్సప్ నిత్యం ప్రజలకు అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా మరో మూడు ఫీచర్లను వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో (Social Media) అత్యధిక మంది వినియోగిస్తున్న సాధనం వాట్సప్ (WhatsApp). సులభతరమైన సేవలతో ఇట్టే ఆకట్టుకున్న ఈ వాట్సప్ ప్రస్తుతం ప్రజలకు నిత్య అవసరంగా మారింది. ఈ వాట్సప్ నిత్యం ప్రజలకు అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు (Update) చేసుకుంటూ సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా మరో మూడు ఫీచర్లను (New Features) వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారుల భద్రత (Security Features), గోప్యతను మరింత మెరుగుపర్చేందుకు కొత్తగా మూడు ఫీచర్లను తీసుకొచ్చింది.
అవేమిటంటే అకౌంట్ ప్రొటెక్ట్ (ఖాతా భద్రత), డివైజ్ వెరిఫికేషన్, ఆటోమెటిక్ సెక్యూరిటీ కోడ్స్. ఈ మూడు ఫీచర్లను వాట్సప్ ప్రవేశపెట్టింది.
1. Account Protect: కొత్త డివైజ్ కు వాట్సప్ ను మార్చుకునేటప్పుడు పాత డివైజ్ లో అనుమతి ఇవ్వడం తప్పనిసరి చేస్తూ అకౌంట్ ప్రొటెక్ట్ ఫీచర్ తీసుకువచ్చింది.
2. Device Verification: మన ప్రమేయం లేకుండా మన ఫోన్ లో (Pone) మాల్ వేర్ (Malware) ద్వారా వాట్సప్ నుంచి అనవసర మెసేజ్ లు వెళ్తున్నాయా (అకౌంట్ టేకోవర్ అటాక్స్) అనేది గుర్తించడానికి డివైజ్ వెరిఫికేషన్ ఫీచర్ తీసుకువచ్చింది. దీని ద్వారా అటాకర్ కనెక్షన్ ను బ్లాక్ చేయవచ్చు.
3. వాట్సప్ ద్వారా మనం పంపే సందేశాలు సురక్షితంగా అవతలి వారికి చేరుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఆటోమెటిక్ సెక్యూరిటీ కోడ్స్ ఫీచర్ పని చేస్తుంది.
ఇకపై వాట్సప్ లోని గ్రూప్స్ లో మీ మొబైల్ నెంబర్ కు బదులుగా మీ పేరు కనిపిస్తుంది. మీరు వాట్సప్ ప్రొఫైల్ లో పెట్టిన పేరు ముందు కనిపించి, తర్వాతే మీ మొబైల్ నంబర్ కనబడుతుంది. గ్రూప్స్ లో నంబర్ వెతకాలంటే నంబర్ తో అవసరం లేదు. వాట్సప్ వినియోగదారుడు నమోదు చేసుకున్న పేరు కొడితే చాలు. ఇలా అనేక ఫీచర్స్ తో, ప్రముఖ సోషల్ మీడియా మెస్సేంజర్ యాప్ దూసుకెళ్తోంది. ఈ విధంగా ప్రజల భద్రతకు వాట్సప్ పెద్దపీట వేస్తోంది.