గ్లోబల్ స్టార్ రామ్చరణ్ సతీమణి ఉపాసన తొలిసారి తన కుమార్తె క్లీంకార ఫొటోను షేర్ చేశారు. ముత్తాత(ఉపాసన తాతయ్య), తాతయ్య(ఉపాసన తండ్రి)తో కలిసి అపోలో ఆస్పత్రిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పవిత్రోత్సవాల్లో క్లీంకార పాల్గొనట్లు తెలిపారు. దీనిపై ఆనందం వ్యక్తం చేస్తూ.. క్లీంకారను చూస్తుంటే తన చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.