హీరో శ్రీకాంత్ కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు నటుడు చంద్రకాంత్, నిర్మాత విజయ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. గట్టుకు చేరుకున్న వారికి ఆలయ పూజారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వేములవాడ ఆలయానికి వెళ్లి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ఆలయాలకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.