తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ‘జైలర్’ భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘జైలర్ 2’ రాబోతుంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఓ పవర్ ఫుల్ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్ర ఊర మాస్ ఉంటుందని సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.