ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమాపై బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా రివ్యూ ఇచ్చారు. మూవీ అద్భుతంగా ఉందని, అల్లు అర్జున్ ప్రదర్శన మరో స్థాయిలో ఉందని తెలిపారు. భార్యాభర్తల మధ్య సన్నివేశాలను ‘పుష్ప 2’లో చక్కగా చూపించారని, ఇలాంటి సీన్స్ బాలీవుడ్లో తెరకెక్కించాల్సి వస్తే కావాల్సినంత అశ్లీలత పెడతారని వెల్లడించారు. దక్షిణాది చిత్రాలను చూసి బాలీవుడ్ ఎంతో నేర్చుకోవాలని పేర్కొన్నారు.