‘కల్కి’ సినిమాలో ఓ పాత్రను రిజెక్ట్ చేశానని నటి కీర్తి సురేష్ చెప్పారు. ‘కల్కిలో ఓ పాత్ర కోసం నాగ్ అశ్విన్ నన్ను అడిగారు. కానీ ఆ పాత్ర నాకు నచ్చకపోవడంతో తిరస్కరించాను. ఈ సినిమాలో నన్ను భాగం చేస్తారని నేను నమ్మాను. బుజ్జి పాత్రకు నాతో డబ్బింగ్ చెప్పించారు. ఈ పాత్రకు మీ డబ్బింగ్ ప్లస్ అయిందని నాతో చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది’ అని పేర్కొన్నారు.