దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా మధ్య సరదా సంభాషణ జరిగింది. ఇటీవల రణ్వీర్ గురించి తేజ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రశాంత్ వర్మ.. ‘ఫొటో క్రెడిట్ లేదా పుష్పా’ అని రిప్లై ఇచ్చాడు. దానికి తేజ.. ‘కృష్ణ సినిమాలో బ్రహ్మానందం వచ్చేశాడు’ అని పేర్కొన్నాడు. దానికి ‘మనకి ఏం కావాలన్నా మనమే అడిగి తీసుకోవాలని ఒక పెద్దాయన ఒకానొక సమయంలో చెప్పారు’ అని వర్మ బదులిచ్చాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.