మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లూసిఫర్. 2019లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘లూసిఫర్2’ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూట్ పూర్తైందని మోహన్ లాల్ తాజాగా పోస్ట్ పెట్టారు. ‘సినిమా చిత్రీకరణ ముగిసింది. నటీనటులు, టెక్నికల్ టీమ్ సహకారంతోనే మేము దీనిని సాధించగలిగాం. అభిమానుల ప్రేమే.. మాపై స్ఫూర్తి పెంచింది’ అని పేర్కొన్నారు.