ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమా హిందీలో సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తోంది. అక్కడ ఏడవ రోజు ఈ సినిమా రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో బాలీవుడ్లో ఈ సినిమా కేవలం వారంలోనే రూ.400 కోట్ల క్లబ్లో చేరింది. దీంతో అక్కడ అతి వేగంగా ఈ ఘనత సాధించిన మూవీగా ఇది రికార్డు సృష్టించింది.