నందమూరి బాలకృష్ణతో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న మూవీ ‘అఖండ 2’. ఈ నెల 25న రిలీజ్ కానున్న ఈ మూవీ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా విడుదలపై బాలయ్య ఓ ఈవెంట్లో స్పందించారు. ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారంలో థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలిపారు. దీంతో DEC 5 శుక్రవారం కావడంతో ఆ రోజే ఈ మూవీ విడుదల కానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.