మలయాళంలో ఇటీవల విడుదలైన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘బోగన్ విల్లియా’. జ్యోతిర్మయి, ఫహద్ ఫాజిల్, కుంచకో బోబన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 17న మలయాళంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం OTTలో మలయాళంతోపాటు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రాబోతోంది. ఈనెల 13న సోనీలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.