ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ ఈ నెల 5న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇటీవల నాలుగో పాట ‘పీలింగ్స్’ ప్రోమో వచ్చింది. తాజాగా ఈ ఫుల్ పాటను ఇవాళ సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.