TG: హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో సినీ నటుడు బాలకృష్ణ అంబులెన్స్, పలు పరికరాలను ప్రారంభించారు. CSRలో భాగంగా BDL సంస్థ అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. అందరికీ క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి తేవాలనేదే తమ లక్ష్యమన్నారు. దాతల సహకారంతో పేదలకు మరింత మెరుగ్గా సేవలు చేస్తామని, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, దాతల సహకారంతో ఈ స్థాయికి చేరిందన్నారు.