రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా ఆమె లీడ్ రోల్ చేస్తున్న ‘మైసా’ సినిమా నుంచి తాజాగా మరో పోస్టర్ విడుదలైంది. ముఖం నిండా గాయాలతో సీరియస్గా ఉన్న నేషనల్ క్రష్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రవీందర్ పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.