గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తనకెంతో స్పెషల్ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కియారా అద్వానీ చెప్పారు. ఈ చిత్రం కోసం మూడేళ్ల నుంచి కష్టపడుతున్నట్లు వెల్లడించారు. దీని షూటింగ్ సమయంలోనే తనకు పెళ్లి జరిగిందని, ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.