బాలీవుడ్ ప్రస్తుత పరిస్థితిపై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా విజయం వెనుక ప్రత్యేక ఫార్ములా ఏదీ ఉండదని అన్నారు. పెద్ద స్టార్లు నటించిన చిత్రాలు కూడా ఒక్కోసారి నిరాశపరుస్తాయని అభిప్రాయపడ్డారు. అన్ని సినిమాలు హిట్ అవుతాయన్న గ్యారంటీ ఉండదని వెల్లడించారు.