అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఈ నెల 4న పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో శోభితకు అక్కినేని ఫ్యామిలీ ఇచ్చే గిఫ్ట్స్పై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తాజాగా నాగార్జున రూ.2 కోట్ల విలువైన లెక్సస్ కారు కొన్నారు. దాన్ని శోభితకు ఇవ్వడానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ కారుతో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాలు శోభితకు ఇవ్వబోతున్నట్లు సమాచారం.