అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈనెల 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి ‘పుష్ప-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై పడింది. రేపు యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్లో జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వెల్లబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.