ఇండియాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన సెలబ్రిటీల జాబితాను ఫార్చ్యూన్ ఇండియా రిలీజ్ చేసింది. ఇందులో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ రూ.92 కోట్ల పన్నులు చెల్లించి.. టాప్ 1లో ఉన్నారు. విజయ్ దళపతి రూ.80 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ.75 కోట్లు పన్ను చెల్లించి ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా రూ.14 కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించి 16వ స్థానంలో ఉన్నారు.