ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. దీంతో మూవీ టీం సక్సెస్ మీట్ నిర్వహించేందుకు హస్తినాకు పయనమయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పుష్పరాజ్ తన తల్లి నిర్మలతో కలిసి ఉన్న ఫొటోను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. దీనికి ఎంత అందమైన ఉదయం.. బిగ్ డే.. అందమైన ప్రారంభం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.