Breakfast: బరువు తగ్గించే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ లు ఇవి..!
బరువు పెరగడానికి కొవ్వు పదార్థాలే కారణం కాదు. మీరు తినే ఆహారం మొత్తం మీ బరువును ప్రభావితం చేస్తుంది. బరువు తగ్గాలంటే, మీరు తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి. బరువు తగ్గడానికి ఉదయం పూట తినాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్, చీజ్, పండ్లతో కూడిన మిశ్రమం
డ్రై ఫ్రూట్స్, చీజ్, పండ్లతో కూడిన మిశ్రమం బాడీకి తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రోటీన్ అందించే ఆహారం.
తేనె, అరచెంచా సిరప్‌ని కలిపి తీసుకుంటే రుచికరంగా ఉండటంతో పాటు కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి.
గ్రీక్ పెరుగు
గ్రీక్ పెరుగు అద్భుతమైన ప్రోటీన్ కంటెంట్, ప్రోబయోటిక్ ఫుడ్.
ఇది పేగు ఆరోగ్యానికి చాలా మంచిది.
హెల్దీ ఫ్రూట్స్, పప్పులు, నట్స్‌తో కలిపి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు.
ప్రోటీన్ స్మూతీ
ఎక్కువ ప్రోటీన్, పోషకాలను అందించే ఫుడ్స్ తీసుకోవాలి.
ప్రోటీన్ పౌడర్, పండ్లు, పాలని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు.
కావాలనుకుంటే మీరు ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ మొత్తాన్ని పెంచేందుకు పీనట్ బటర్, చియా సీడ్స్, పెరుగు కలిపి తీసుకోవచ్చు.
కోడిగుడ్లు
కోడిగుడ్డులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉన్నాయి.
కోడిగుడ్లతో హెల్దీ ఫుడ్స్‌గా చేసుకుని తినొచ్చు.
ఉడికించిన కోడిగుడ్డు, కూరగాయలు, చీజ్ మిక్స్ చేసి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు.
దీని వల్ల ఎక్కువ సేపు ఆకలి అవ్వదు.
ఓట్స్ పెరుగు పార్ఫైట్
అరకప్పు ఓట్స్‌తో పాటు అరకప్పు పెరుగు, అరకప్పు పాలు, పావు కప్పు బెర్రీలు ఓ కంటెయినర్లో వేసి బాగా కలపండి.
రాత్రంతా రిఫ్రిజిరేటర్లో ఉంచండి.
దీనిని మీరు బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు.
ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఇతర పోషకాలు ఉన్నాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.