habits : హ్యాపీ లైఫ్ కోసం సాయంత్రం ఏడు గంటల్లోపు ఈ పనులు తప్పక పూర్తి చేసేయండి!
మనం జీవితంలో హ్యాపీగా ఉండటానికి మన రోజు వారీ అలవాట్లు కూడా దోహదం చేస్తాయి. రాత్రి ఏడు గంటల లోపు కొన్ని పనులను పూర్తి చేసుకుని అందమైన రాత్రికి సిద్ధం కావడం ద్వారా మనం జీవితంలో కొంత సంతృప్తిగా ఉండగలుగుతాం. అవేంటంటే...?
habits : ఈ మధ్య కాలంలో అంతా ఒత్తిడిలోనే జీవితాల్ని గడుపుతున్నారు. ఆఫీసులు, వ్యాపారాలు, చదువులు, డబ్బులు అంటూ రకరకాల టెంక్షన్స్లో రోజుల్ని వెళ్లదీస్తున్నారు. అయితే జీవితంలో సంతృప్తిగా, ఆనందంగా ఉండేందుకు రాత్రి ఏడు గంటల లోపు కొన్ని పనులను పూర్తి చేసేసుకోమని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని అలవాటు చేసుకుంటే జీవితంలో మార్పును చూస్తారంటున్నారు. మరి అవేంటో తెలుసుకుని వీలైతే ఆచరించేద్దాం.
సాయంత్రం ఏడు గంటల లోపు భోజనం(early dinner) చేసేయడాన్ని ముందుగా అలవాటు చేసుకోండి. దీని వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే మనం మార్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పని… అర్ధరాత్రిళ్ల వరకు ఫోన్ చూస్తూ గడపడం. ఫోన్‌ని రాత్రి(NIGHT) ఏడు గంటల తర్వాత స్క్రోల్ చేయడం మానేయండి. సోషల్ మీడియాల్లో ఎక్కువగా గడపడం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఈ బ్లూ లైట్ ఎక్స్పోజర్ అనేది మన నిద్రకు భంగం కలిగిస్తుంది. ఇన్సోమ్నియా లాంటి దీర్ఘ కాలిక వ్యాధులకు కారణం అవుతుంది. ఎక్కువ రోజుల పాటు నిద్ర లేకపోతే ఎన్ని అనారోగ్యాలు వస్తాయో మనందరికీ తెలిసిందే. కాబట్టి మనం ఆనందంగా ఉండాలంటే ముందు ఆరోగ్యంగానూ ఉండాలని గుర్తుంచుకోండి.
సాయంత్రం(Evening) ఏడు గంటల లోపు పూర్తి చేయాల్సిన పనుల్లో ఆఫీసు పనులు ఒకటి. సాయంత్రం ఏడు తర్వాత కుటుంబానికి సమయం కేటాయించండి. కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబంతో కలిసి పనులు చేసుకోండి. చక్కగా మాట్లాడుకోండి. ఆహ్లాదంగా గడిపేందుకు ప్రయత్నించండి. అంతేకాని ఆఫీసులో, వ్యాపారంలో ఆ రోజు జరిగిన వాటిని అన్నీ తెచ్చి అదే ఆలోచనలతో గడపకండి. ప్రొఫెషనల్ లైఫ్ నుంచి పూర్తిగా డిస్కనెక్ట్ అయి ఫ్యామిలీ(Family) లైఫ్‌తో పూర్తిగా కనెక్ట్ అవ్వండి. సాయంత్రం ఏడు గంటల తర్వాత అన్నీ ఇష్టమైన పనులే చేసే ప్రయత్నం చేయండి. లైట్స్ డిమ్ చేసుకోండి. మంచి సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించుకోండి. ఇష్టమైన వారితో మైండ్‌ఫుల్‌నెస్‌తో గడిపే ప్రయత్నం చేయండి. మరుచటి రోజు ఉదయం మీలో మార్పును మీరే గమనిస్తారు.