క్రికెట్ (Cricket)లో కూల్ మనిషి ఎవరంటే అందరూ చెప్పేది మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni). క్రికెట్ లో భారత్ చరిత్రను తిరగరాసిన కెప్టెన్ ధోని. క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పేరు ధోని. అలాంటి ధోనీ వయసు (Age) పెరుగుతున్నా.. ఆటలో (Play) మాత్రం ఎలాంటి మార్పు లేదు. కుర్రాళ్లకు దీటుగా ఆడుతూ సత్తా చాటుతున్నాడు. మరి అలాంటి ధోనీ రిటైర్మెంట్ (Retirement) ఎప్పుడూ అని పదే పదే ప్రశ్నిస్తే చిరాకు రాదా వస్తది. ఇదే ప్రశ్న వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) కు ఎదురైంది. ఆ ప్రశ్నపై వీరూ మండిపడ్డారు. పదే పదే ఇదే ప్రశ్ననా? అని అసహనం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ (IPL)లో భాగంగా బుధవారం లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్ (Cancelled) రద్దయిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు హోస్ట్ డాని మోరిసన్ (Danny Morrison) సెహ్వాగ్ తో మాట్లాడారు. సెహ్వాగ్ ను పలు ప్రశ్నలు అడుగుతూ ధోని రిటైర్మెంట్ పై కూడా అడిగారు. ‘పదే పదే ధోనిని ఎందుకు ఇదే ప్రశ్న అడుగుతారు? సెహ్వాగ్ ఎదురు ప్రశ్నించారు. ‘నాకు అర్థం కావటడం లేదు. ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నారు? అతడి (ధోని)కి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావొచ్చు. అంతమాత్రాన ఓ ప్లేయర్ ఎందుకు అడుగుతున్నారు? ఈ విషయంలో నిర్ణయం అతడిది. నిర్ణయం అతడిని తీసుకోనివ్వండి. ఈ ప్రశ్నకు సమాధానం ధోని నుంచి రాబట్టాలని అనుకోవచ్చు. కానీ ఇది చివరిదో కాదో ఒక్క ధోనికి మాత్రమే తెలుసు. ఇలా అడగడం సరికాదు’ అని సెహ్వాగ్ తెలిపాడు.