»Telangana Police Arrested Herbal Products Manager On Harrassing Women At Vijayawada
Weight Loss పేరిట మహిళలతో న్యూడ్ కాల్స్.. మేనేజర్ అరెస్ట్
అసభ్య ఫొటోలు పంపుతుండడంతో పాటు నగ్న వీడియో కాల్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. అలాగే ఒకరోజు అతడు న్యూడ్ కాల్ చేయడంతో ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి వరకు మహిళలతో వీడియోలు మాట్లాడుతూ వేధిస్తున్నాడు.
అధిక బరువు (Weight Loss) తగ్గాలనుకునే మహిళలను (Women) ఆసరాగా చేసుకుని ఓ సంస్థ మేనేజర్ రాసలీలలకు పాల్పడ్డాడు. ఫోన్ లలో వీడియో కాల్స్ (Video Calls) పేరిట వేధింపులకు పాల్పడుతున్నాడు. అతడి బారినపడి ఎంతో మంది మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక మహిళ సాహసంతో అతడిని పట్టించింది. అయితే అతడు పరారై విజయవాడలో దాక్కున్నాడు. అతడిని ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు (Telangana Police) అరెస్ట్ చేశారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అధిక బరువు తగ్గించుకునేందుకు మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థ హెర్బల్ లైఫ్ ప్రొడక్స్ట్ లో మేనేజర్ (Manager)గా వక్కపట్ల చంద్రశేఖర్ పని చేస్తున్నాడు. ప్రొడక్ట్ సేల్స్ పేరిట మహిళలకు దగ్గరవుతున్నాడు. వారి ఫోన్ నంబర్లు తీసుకుని సంస్థ ఉత్పత్తుల (Products) పేరిట తరచూ ఫోన్లు చేస్తూ చనువు ఏర్పరచుకుంటున్నాడు. అనంతరం ఆ మహిళలను లొంగదీసుకుని అసభ్య చిత్రాలు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడు. ఇలా చాలా మందిని వేధిస్తున్నాడు.
సంస్థ ఉత్పత్తుల పేరిట అదే మాదిరి ఓ మహిళను వేధించే (Harrassment) ప్రయత్నం చేశాడు. ఆమె ఎంత వారిస్తున్నా వినకుండా బలవంతం పెడుతున్నాడు. అసభ్య ఫొటోలు పంపుతుండడంతో పాటు నగ్న వీడియో కాల్స్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. అలాగే ఒకరోజు అతడు న్యూడ్ కాల్ చేయడంతో ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి వరకు మహిళలతో వీడియోలు మాట్లాడుతూ వేధిస్తున్నాడు. ఆమె వెంటనే కూకట్ పల్లి (Kukatpally) పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన వార్త తెలుసుకున్న చంద్రశేఖర్ హైదరాబాద్ వదిలి పారిపోయాడు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులకు విజయవాడలో అతడి జాడ కనిపించింది. వెంటనే అక్కడకు వెళ్లిన తెలంగాణ పోలీసులు చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ (Hyderabad)కు తరలించి రిమాండ్ కు పంపించారు. న్యూడ్ కాల్స్ పేరిట వేధించే వారిపై మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.