అనారోగ్యంతో (Critical Condition) కొన్ని నెలలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) మృతి చెందారనే వార్తలు కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది. అయితే ఇది తప్పని ఆస్పత్రి వైద్యులతో పాటు శరత్ బాబు కుటుంబసభ్యులు ప్రకటన చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా మరో ప్రకటన వెలువడింది. ‘వస్తున్న వార్తలు అవాస్తవం.. ఆయన కోలుకుంటున్నారు’ అని శరత్ సోదరుడి కుమారుడు ప్రకటించారు.
శరత్ బాబు ఆరోగ్యంపై ఆయన సోదరుడి కుమారుడు ఆయుశ్ తేజస్ (Ayush Tejas) స్పందిస్తూ గురువారం మీడియాతో మాట్లాడారు. ‘శరత్ బాబు ఆరోగ్యం నిలకడగా (Stable) ఉంది. మునుపటి కంటే ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం (Time) పడుతుంది. ఆయన చనిపోయారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అభిమానులు, ప్రజలకు విన్నవిస్తున్నా. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న వారందరికీ ధన్యవాదాలు’ అని ఆయుశ్ తేజస్ తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఆయన మృతి చెందారనే అసత్య వార్తలు (Fake News) వెలుగులోకి వచ్చాయి. వెంటనే ఆస్పత్రి వైద్యులు, కుటుంబసభ్యులు స్పందించారు. శరత్ బాబు బతికే ఉన్నారు.. చికిత్స పొందుతున్నారని కుటుంబసభ్యులు తెలిపిన విషయం తెలిసిందే.