అన్నమయ్య: కార్తీక సోమవారం సందర్భంగా రాజంపేట పట్టణంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ మేరకు తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీశివుడిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. ఇందలో భాగంగా పాత బస్టాండ్ సమీపంలోని పురాతన శివాలయం, మన్నూరులోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.