అన్నమయ్య: మెడికల్ కళాశాలల ప్రైవేటుకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వైసీపీ ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్ కోరారు. ఇందులో భాగంగా ఇవాళ మదనపల్లె మండలం సీటీఎం గ్రామపంచాయతీలోని కొత్తవారి పల్లెలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వైద్యాన్ని భ్రష్టు పట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆరోపించారు.