ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మరోసారి యుద్ధం చెలరేగింది. ఆ రెండు దేశాల మధ్య పాత కక్షలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ పగ ఇప్పటికీ చల్లారలేదు. యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్న తరుణంలో ఆ రెండు దేశాల్లో ఇప్పటి వరకూ 532 మందికి పైగా మరణించారు. 3 వేల మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. యూదుల సెలవు దినం అయిన శనివారం రోజు సరిహద్దుల నుంచి 5 వేల రాకెట్లు, డజన్లకొద్దీ యుద్ధ విమానాల ద్వారా మాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ నగరాలపై మెరుపు దాడులు చేశారు.
ఆ దాడుల్లో 300 మందికి పైగా మరణించారు. 1500 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడితో ఇజ్రాయెల్ దిగ్భ్రాంతికి లోనైంది. తేరుకుని పాలస్తీనా గాజాపై వైమానికి దాడులు చేపట్టింది. ఆ దాడుల్లో 232 మంది ప్రాణాలొదిరారు. మరో 1700 మందికి పైగా గాయాలపాలయ్యారు. రాకెట్ కాల్పులు, సైరన్ శబ్దాలతో ఇజ్రాయెల్ నగరాలు హోరెత్తాయి. ఆ రెండు దేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు భయంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.
ఈ రెండు ప్రాంతాల మధ్య శతాబ్దాల నుంచి యుద్ధం జరుగుతోంది. ఏ సమయంలో రాకెట్లు వచ్చి పడతాయో తెలియకపోవడంతో ఇజ్రాయెల్ అమెరికా సాయంతో ప్రత్యేెక డిఫెన్స్ అకాడమీని ఏర్పాటు చేసుకుంది. శత్రువుల రాకెట్లను, ప్రత్యర్థులను ఆ అకాడమీ సైన్యం ద్వారా తిప్పికొడుతోంది. 2021 ఉద్రిక్తతల సమయంలో ఈ వ్యవస్థ వల్లే ఇజ్రాయెల్ స్వల్ప నష్టంతో బయటపడగలిగింది. అయితే ఈసారి ఆ వ్యవస్థ రాకెట్లను అడ్డుకోలేకపోయింది. అందుకే హమాస్ తన ఉగ్రవాదుల ద్వారా 5000 రాకెట్లను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. ఫలితంగా ఇరు ప్రాంతాల్లో భారీగా ప్రాణ నష్టం వాటిళ్లింది.