»Israel Hamas War That Does Not Stop So Far More Than 4 Thousand People Have Died
Israel-Hamas War: ఆగని ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..ఇప్పటి వరకూ 4 వేల మందికి పైగా మృతి
ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకూ 4 వేల మందికి పైగా మృతిచెందారు. ఇరు ప్రాంతాల సైన్యం ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భూదాడికి కూడా యత్నించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచ దేశాలు సైతం ప్రయత్నిస్తున్నాయి.
ఇజ్రాయెల్-పాలస్తీనా (Israel-Palestina) మధ్య యుద్ధం (War) ఇంకా చల్లారలేదు. యుద్ధంలో హమాస్ ఉగ్రవాద మిలిటెంట్లు అతి క్రూరమైన దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘోరమైన యుద్ధంపై ప్రపంచ దేశాలన్నీ పెదవి విరుస్తున్నాయి. యుద్ధాన్ని ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి, భారత్ కూడా సూచించింది. మొదట హమాస్ మిలిటెంట్లు విచక్షణారహితంగా ఇజ్రాయెల్‌పై దాడి చేసి మారణ హోమాన్ని సృష్టించాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతీకార జ్వాలలతో రగిలిపోతోంది. హమాస్ (Hamas) ఉగ్రవాదుల దాడిలో ఇజ్రాయెల్‌కు చెందిన వారు 1400 మంది దుర్మరణం చెందారు.
తాజాగా ఇజ్రాయెల్ (Israel) గాజాపై చేస్తున్న ఎదురుడాదిలో 2670 మంది చనిపోయారు. యుద్ధం (War) కారణంగా ఇప్పటి వరకూ 4000 మందికి పైగా ప్రజలు, సైనికులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అంతేకాకుండా పాలస్తీనాకు చెందిన 10 వేల మందికిపైగా గాయాలపాలయ్యారు. దాడికి ముందు ఉత్తర గాజా ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీంతో దాదాపుగా 10 లక్షల మంది అక్కడి నుంచి వెళ్లిపోయి తమ ప్రాణాలను కాపాడుకున్నారు.
యుద్దం ఇలానే కొనసాగితే వేల మంది చనిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచంలోని మిగిలిన దేశాలు పలు సంప్రదింపులు జరుపుతున్నాయి. ముఖ్యంగా హమాస్ తీవ్రవాదులు చేసే దారుణాల వల్ల చిన్నారులు సైతం ప్రాణాలు విడుస్తున్నారు. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ భూదాడికి ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే అతి పెద్ద ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. యుద్ధం సందర్భంగా ఇప్పటికే సగం గాజా ప్రాంతం ఖాళీ అయ్యింది.