Fire Effect: కెనడాలో కార్చిచ్చు..అమెరికాలో మాస్కులు ధరించాలని ఆదేశం
కెనడాలో కార్చిచ్చు పొగ అగ్రరాజ్యం అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. న్యూయార్క్ ఎయిర్ క్వాలిటీ 500 ఏక్యూఐ నమోదైంది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రజలు విధింగా మాస్క్ ధరించాలని అమెరికా వాతావరణ శాఖ స్పష్టంచేసింది.
Fire Effect: అగ్రరాజ్యం పక్కనే ఉన్న కెనడాలో (canada) రాజుకున్న కార్చిచ్చు అమెరికాను (America) ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సమ్మర్ స్టార్టింగ్లో కెనడా అడవుల్లో 500 చోట్ల కార్చిచ్చు అంటుకుంది. నిజానికి ఇక్కడ కార్చిచ్చు కామనే.. ప్రతిసారీ అది పశ్చిమ రాష్ట్రాల్లో ప్రభావం ఉండేది. ఈ సారి తూర్పు ప్రాంతంపై ఎఫెక్ట్ చూపిస్తోంది. దీంతో నోవా స్కాటియా, క్యూబెక్, ఆంటారియోలాకు విస్తరించటంతో కెనడాలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దాని పక్కన దేశాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంది.
80 లక్షల ఎకరాల్లో మంటలు
వేసవి ప్రారంభంలో 80 లక్షల ఎకరాల్లో మంటలు విస్తరించాయి. ఏప్రిల్ నెలలో బ్రిటిష్ కొలంబియా, అల్బర్టాలో మొదలైన కార్చిచ్చు వల్ల 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చమురు ఉత్పత్తి కూడా నిలిపివేయాల్సి వచ్చింది. ఒటావా, టొరంటో నగరాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. ఒటావాలో కొన్ని ప్రాంతాల్లో దట్టంగా పొగ కమ్ముకుకోవడంతో ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. కెనడా అడవుల్లో మంటల నుంచి వస్తోన్న పొగ పక్కనే గల అమెరికా (America) రాష్ట్రాలను చేరుతుంది. మరో వారం రోజులపాటు పొగ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. దీంతో అమెరికాలో (America) గల న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ, రాలీ, కొలంబియా సిన్సినాటి, క్లీవ్లాండ్, డెలావేర్, పెన్సిల్వేనియో, సౌత్ కరోలినాలో దట్టమైన పొగ ఆవరించి ఉంది.
ఎయిర్ క్వాలిటీ 500 ఏక్యూఐ
చాలా చోట్ల ఆకాశం పర్పుల్ కలర్లోకి మారింది. న్యూయార్క్లో బుధవారం ఎయిర్ క్వాలిటీ 500 ఏక్యూఐ నమోదైంది. ఏక్యూఐ 300 దాటితే ప్రమాదకరంగా పరిగణిస్తారు. అదీ ఇప్పుడు 500కు చేరింది. 1999లో న్యూయార్క్లో వాయు నాణ్యత రికార్డు చేయడం ప్రారంభించారు. అప్పటినుంచి ఈ స్థాయిలో ఎయిర్ క్వాలిటీ రికార్డ్ కాలేదని చెబుతున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అమెరికా వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరిక జారీచేసింది. ప్రజలు విధిగా మాస్క్ ధరించాలని కోరింది. ప్రజలు అలర్ట్గా ఉండాలని అమెరికా (America) అధ్యక్షుడు జో బైడెన్ (biden) పిలుపునిచ్చారు. పొగ వల్ల ఫిలడెల్ఫియాలో మేజర్ లీగ్ బేస్ బాల్ టోర్నీ వాయిదా వేశారు. వాయు కాలుష్యం వల్ల విమాన ప్రయాణాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.
కారణం ఇదే..?
మానవ తప్పిదాలు, వాతావరణ మార్పుల వల్ల కార్చిచ్చు విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కార్చిచ్చు నియంత్రణ కోసం ఇతర దేశాల సాయాన్ని కెనడా కోరుతోంది. అమెరికా 600 మంది అగ్నిమాపక సిబ్బందిని కెనడా పంపించనుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా నుంచి బృందాలు కెనడా (canada) వెళ్లనున్నాయి. కెనడా (canada) కార్చిచ్చు పొగ తమ వరకు విస్తరించొచ్చని నార్వే భయపడుతోంది.