RRR : మన దగ్గర ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు.. కానీ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకొని.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత మాత్రం రాజమౌళికే సొంతం. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్‌కు పునాది వేసి.. ఒక్కసారిగా యావత్ ప్రపంచం.. తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాడు.
మన దగ్గర ఎందరో గొప్ప దర్శకులు ఉన్నారు.. కానీ ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకొని.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత మాత్రం రాజమౌళికే సొంతం. బాహుబలితో పాన్ ఇండియా మార్కెట్‌కు పునాది వేసి.. ఒక్కసారిగా యావత్ ప్రపంచం.. తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాడు. అలాంటి దర్శకుడి నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా వస్తుందా.. అని ఎదురు చూస్తున్న వారికి.. ఆస్కార్ అందించి చరిత్రను క్రియేట్ చేశాడు రాజమౌళి. 2017లో ఊహకందని విధంగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో సినిమా అనౌన్స్ చేసి.. జస్ట్ ప్రకటనతోనే ప్రభంజనం సృష్టించాడు. 2017లో రామారావు, రామ్ చరణ్, రాజమౌళి పేర్లు కలిసేలా.. RRR అనే కాప్షన్ పెట్టి ఓ ఫోటో షేర్ చేశాడు జక్కన్న. ఈ ముగ్గురి కాంబినేషన్ అన్నప్పుడే చరిత్రకు నాంది పడిపోయింది. 2018లో ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్‌తో అఫిషియల్‌గా సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత ఇదే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వడంతో.. రౌద్రం, రణం, రుధిరం అంటూ వివరణ ఇస్తూ.. ఆర్ఆర్ఆర్‌నే టైటిల్‌గా ప్రకటించాడు. ఇక ఆ తర్వాత ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని.. కరోనాను దాటుకొని.. ఎట్టకేలకు 2022 మార్చి 25న ఆర్ఆర్ఆర్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అప్పుడు మొదలైన ఆర్ఆర్ఆర్ సౌండ్ ఇంకా మన చెవుల్లో మోగుతునే ఉంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్ సైతం రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అది, ఇది అని కాదు.. అన్ని అవార్డులను కొల్లగొట్టేసింది. ఫైనల్‌గా నాటు నాటు సాంగ్‌కి, 95వ అకాడమీ అవార్డుల్లో ఆస్కార్ అందుకొని.. చరిత్ర సృష్టించాడు రాజమౌళి. ఆ చరిత్ర థియేటర్లోకి వచ్చి నేటికి, అంటే 2023 మార్చి 25 నాటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. దీంతో ఈ హిస్టారికల్ మూమెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చరణ్, తారక్, రాజమౌళి ఫ్యాన్స్. #1YearOfHistoricalRRR అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మొత్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన మన జక్కనకు ఓసారి సెల్యూట్ కొట్టేయండి. ఇప్పుడే కాదు.. నెక్స్ట్ మహేష్ బాబు సినిమాతో ఎన్నో సంచలనాలు సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు రాజమౌళి. మరి ఈ సినిమాతో ఎన్ని ఆస్కార్ అవార్డుటు కొల్లగొడతాడో చూడాలి.