»These Are The Substances That Should Not Be Taken At Night
Health Tips: రాత్రి పూట తీసుకోకూడని పదార్థాలు ఇవీ
కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని విని తింటుంటాం. కానీ అది ఏ సమయంలో, ఏ కాలంలో తినడం వల్ల లాభం, ఎప్పుడు తింటే నష్టం జరుగుతుందని సైతం తెలుసుకోవాల్సి ఉంటుంది.
అనేక వ్యాధులకు కారణం ఆహారపు అలవాట్లు మీరు హెల్థీ ఫుడ్ (Healthy food) తీసుకుంటున్నరా..ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రాత్రి పూట తీసుకునే ఆహారంలో మనం ఎన్నో రకాలుగా ఆలోచించాలి. ఎందుకంటే నైట్ మనం తీసుకునే ఆహారం బాగుండాలి. లేకపోతే జీర్ణ సంబంధమైన సమస్యలు రావడం సహజం. రాత్రి ఎక్కువగా భోజనం తీసుకుంటే నిద్రపై ప్రభావం పడుతుంది. మసాలాలు (Spices) , కారం, ఉప్పు ఎక్కువగా ఉండే వాటికి దూరంగా ఉండటమే మంచిది. రాత్రి సమయంలో ఫిజాలు, బర్గర్లు, మాంసాహారాలు తింటే త్వరగా జీర్ణం కావు. ఫలితంగా మనకు నిద్ర సరిగా పట్టదు. దీంతో ఆరోగ్యం (health) దెబ్బతింటుంది. అందుకే తేలిగ్గా అరిగే ఆహారాలు తీసుకుంటేనే మంచిది. నిద్ర బాగా పడుతుంది. హాయిగా ఉంటుంది.
కూల్ డ్రింక్స్(Cool drinks), కాఫీ, టీ లాంటివి తీసుకోవద్దు. ఇందులో కెఫిన్ మెదడుకు ఉత్తేజం తీసుకొస్తుంది. ఫలితంగా మనకు నిద్ర పట్టదు. అందుకే ఇలాంటి సాయంకాలం పూట పెట్టుకోవద్దు. గ్యాస్ట్రిక్ సమస్యలు (Gastric problems) వచ్చే అవకాశాలుంటాయి. దీంతో వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. లేకపోతే శరీరానికి ఇబ్బందులు రావడం గ్యారెంటీ. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. రాత్రి సమయంలో స్వీట్లు (Sweets) తినడం కూడా కరెక్టు కాదు. ఇందులో చక్కెర అధికంగా ఉండటం వల్ల ఇది రక్తంలో షుగర్ నిల్వలు పెంచుతుంది. తద్వారా మనకు సరిగా నిద్ర పట్టకుండా చేస్తుంది. దీంతో గ్యాస్ట్రిక్, ఎసిడిటి (ACDT)సమస్యలు వస్తాయి. ఇలా మనం రాత్రి పూట తీసుకునే ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు నష్టాలే ఎక్కువ.