Eating a spoonful of ghee every day will reduce weight?
Ghee: వంటలో నెయ్యి ఉపయోగించడం వల్ల ఆహారానికి రుచి మాత్రమే కాదు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా దక్కుతాయి. చపాతీ, రోటీ, హల్య, సాంబార్ వంటి వంటకాలలో ఒక చెంచా నెయ్యి వేస్తే ఆహారం మరింత రుచికరంగా మారడమే కాకుండా, మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బరువు పెరుగుతారా?
చాలా మంది నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతారనే భయంతో దానిని దూరం పెడతారు. కానీ, మితంగా తినే నెయ్యి బరువు పెరగడానికి కారణం కాదు. నెయ్యిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, అది ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.
జలుబు నివారణ: నెయ్యి శరీరాన్ని లోపలి నుండి వేడి చేస్తుంది, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
వ్యాధి నిరోధక శక్తి: నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండే బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కీళ్ల నొప్పులు: నెయ్యిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి.
జీర్ణక్రియ: నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యం: నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
కంటి ఆరోగ్యం: నెయ్యిలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మంచిది.
బరువు తగ్గడానికి: నెయ్యి జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా, శరీరానికి శక్తిని అందించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఎంత నెయ్యి తినాలి?
ఒక రోజుకు ఒకటి లేదా రెండు చెంచాల నెయ్యి మితమైన పరిమాణంగా భావిస్తారు. మీరు ఎంత నెయ్యి తినాలో మీ వయస్సు, ఆరోగ్య స్థితి, శారీరక శ్రమ స్థాయిలపై ఆధారపడి ఉంటుంది.