»Excess Body Fat Will Be Reduced Quickly Know How Bullet Coffee Works To Reduce Weight
Weight Loss: బరువు తగ్గించే బులెట్ కాఫీ.. ఎలా తయారు చేయాలో తెలుసా?
మనలో చాలా మంది కాఫీ ప్రియులు ఉండి ఉంటారు. వారికి ఉదయం లేవగానే.. వేడి వేడి కాఫీ తాగితేనే రోజు మొదలౌతుంది. ఆ రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అయితే హెల్తీగా ఉండాలనుకునేవారు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎక్కువగా తాగుతారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని ఎక్కువ తాగేందుకు చూస్తారు. దీనివల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు ఉంటాయని డైటీషియన్లు కూడా చెప్తున్నారు. ఈ బుల్లెట్ కాఫీతో బరువు ఎలా తగ్గుతారో ఓసారి చూద్దాం..
Excess body fat will be reduced quickly, know how bullet coffee works to reduce weight
బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ అంటే ఏమిటి
బుల్లెట్ ప్రూఫ్ కాఫీని వెన్న, MCT నూనెతో తయారు చేస్తారు. కొత్త రకం బటర్ కాఫీని కూడా పిలవవచ్చు. ఇది టిబెట్‌లో బాగా ప్రాచుర్యం పొందింది.ఈ కాఫీ చాలా కాలంగా ఉపయోగించబడుతున్నప్పటికీ, కొద్దిమంది మాత్రమే ఈ కాఫీ గురించి విన్నారు. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనేది కొవ్వు రహిత పానీయం, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం, హిమాలయాల్లో నివసించేవారు చాలా కాలంగా ఈ కాఫీని తాగుతున్నారు. ఈ కాఫీలో వెన్నను ఉపయోగిస్తారు. అందుకే దీన్ని బటర్ కాఫీ అని కూడా అంటారు. ఈ కాఫీ నాణ్యమైన కాఫీ గింజలతో తయారు చేయబడింది. ఇందులో నెయ్యిలా పనిచేసే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ కాఫీనిని కీటో కాఫీ లేదా బటర్ కాఫీ అని కూడా అంటారు. దీనిలో హెల్తీ ఫ్యాట్స్‌తో తయారు చేస్తారు. అందుకే దీనిని ఎనర్జీ డ్రింక్‌గా తీసుకుంటారు. ఇది శరీరానికి ఆరోగ్యకరమైన పోషకాలు, కొవ్వులను అందిస్తుంది. ఇది ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉంచి.. అన్ హెల్తీ స్నాక్ తీసుకోకుండా చేస్తుంది. ఆకలిని తగ్గించి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని చెడు కొవ్వును బయటకు పంపేస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ రోజంతా మీకు శక్తిని అందిస్తూ.. రక్తంలోని చక్కెర స్థాయులను కంట్రోల్ చేస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కిటోసిన్ను ప్రేరేపిస్తుంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించి.. శక్తి వనరుగా మార్చి.. ఎనర్జీగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు దరిచేరవు. వేగంగా, హెల్తీగా బరువు తగ్గే అవకాశముంటుంది.
బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో ఉపయోగించే బటర్, నెయ్యి వంటి పదార్థాలు కీటోసిన్ను ప్రేరేపించి.. ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి మధుమేహమున్నవారు కూడా దీనిని తాగవచ్చు. ఈ కాఫీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బీటా కెరోటిన్, విటమిన్ ఏ,డి,ఈ, కె వంటి విటమిన్లు పోషకాలను శరీరానికి అందజేస్తాయి. అంతేకాకుండా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. గట్ ఆరోగ్యం మెదడుపై మంచి ప్రభావం చూపిస్తుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ వల్ల కూడా అదే జరుగుతుంది. గట్ ఆరోగ్యంగా ఉండడం వల్ల పని చేయడంలో ఫోకస్ పెరుగుతుందట. కొన్ని రకాల కాలేయ వ్యాధులను, టైప్ 2 డయాబెటిస్ వంటి వాటిని దూరం చేస్తుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. బుల్లెట్ కాఫీ శరీరాన్ని ఫ్యాట్ బర్నింగ్ మోడ్‌లో ఉంచుతుంది కానీ ఈ పదార్ధాలు ఏవీ పోషకాహారాన్ని అందించవు. ఈ కాఫీని ఎక్కువగా తినడం వల్ల పోషకాలు అందవు.బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కొవ్వును కరిగించడంలో చాలా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని వల్ల శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఊబకాయం , బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.