W.G: తాడేపల్లిగూడెం (M) కుంచనపల్లి శ్మశాన వాటిక సమీపంలో గురువారం 2 మోటార్ సైకిళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తాడేపల్లి మహిమారావు (21) చికిత్స పొందుతూ విజయవాడ ఆస్పత్రిలో మృతి చెందాడని రూరల్ ఎస్సై ప్రసాద్ తెలిపారు. మృతుడు కుంచనపల్లి వాసిగా గుర్తించారు. మరో మోటార్ సైకిల్ పై వెళ్తున్న కోమటి నాగబాబుకు గాయాలై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.