KMR: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా KMR జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 242 కేసులు నమోదయ్యాయి. KMR సబ్ డివిజన్లో 117 కేసులు, బాన్సువాడ సబ్ డివిజన్లో 70 కేసులు, ఎల్లారెడ్డి సబ్ డివిజన్లో 55 కేసులు నమోదు అయినట్లు జిల్లా SP రాజేష్ చంద్ర వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.