మేడారం జాతర పనుల్లో నాణ్యత లోపిస్తోందని, మహిళలకు టాయిలెట్ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీఆర్ఎస్ ఇన్ఛార్జి నాగజ్యోతి అన్నారు. ముందస్తుగానే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండగా, సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో అవస్థలు పడుతున్నారన్నారు. దుమ్ము, ధూళితో దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు.