KNR: హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో, సద్గురు వేద భారతి విద్యాపీఠం ఆధ్వర్యంలో, 100 మంది పిల్లలకు భగవద్గీత పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ తహశీల్దార్ జె. నరేందర్, మున్సిపల్ కమిషనర్ కే. సమ్మయ్య, ఎంఈవో బి.శ్రీనివాస్, సింగపూర్ సర్పంచ్ సమ్మయ్యలు పాల్గొన్నారు.