ADB: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జైనథ్ మండల ఎస్సై పవర్ గౌతమ్‌ను బాలాపూర్ గ్రామ సర్పంచ్ రాహుత్ అచ్యుత్, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం స్టేషన్‌కు వెళ్లిన నాయకులు ఎస్సైని శాలువాతో సత్కరించి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలని కోరారు.