కాలంతో పని లేకుండా నెయ్యిని ఇష్టంగా తినేవారు చాలా మందే ఉంటారు. చలికాలంలో నెయ్యి తినడం వలన ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలుసా? కేవలం బరువు పెరగడం ఒక్కటే కాదు, ఇంకా ఎన్నో రకాలుగా మన శరీరానికి నెయ్యి నష్టం కలిగిస్తుంది.
Ghee: ముక్కలేనిదే ముద్ద దిగదు అనే బ్యాచ్‌లా నెయ్యి(Ghee)లేనిదే ముద్ద దిగదు అనే వారు ఉన్నారు. కాలంతో పని లేకుండా చాలా మంది నెయ్యిని ఎంతో ఇష్టపడి తింటారు. వేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి వేసుకుని తినడం పరిపాటి. నెయ్యి లేనిదే భోజనం చేయడానికి ఇష్టపడని వారు ఉంటారు. బరువు పెరుగుతారని కొంతమంది నెయ్యిని దూరం పెడుతుంటారు. రుచి, వాసన కోసం ప్రపంచవ్యాప్తంగా నెయ్యికి డిమాండ్ ఎక్కువ. దీనికి ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దీనిని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. అది అన్ని వేళల కాదు. కొన్నిసార్లు వాతావరణంలో మార్పుల వల్ల నెయ్యిని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.