»Vice President Jagdeep Dhankhar Praised Prime Minister Modi
Modi శతాబ్దపు యుగపురుషుడు.. ఉపరాష్ట్రపతి కామెంట్లను ఖండించిన కాంగ్రెస్, బీఎస్పీ
ప్రధాని నరేంద్ర మోడీ యుగపురుషుడు అని ఉప రాష్ట్రపతి ధన్ కర్ కీర్తించారు. ఆ కామెంట్లను కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వ్యక్తి పూజ చేసేందుకు ఇంతలా దిగజారాలా సార్ అని కామెంట్ చేశారు.
Vice President Jagdeep Dhankhar Praised Prime Minister Modi
Prime Minister Modi: ప్రధాని మోడీపై (Modi) ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankhar) ప్రశంసల వర్షం కురిపించారు. మోడీని ఏకంగా మహాత్మా గాంధీతో పోల్చారు. గాంధీ శతాబ్దపు మహా పురుషుడు అని.. మోడీ శతాబ్దపు యుగపురుషుడని అభివర్ణించారు. బానిస సంకెళ్ల నుంచి గాంధీ (Gandhi) విముక్తి కల్పిస్తే.. మోడీ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. జైన ఆధ్యాత్మిక వేత్త, తత్వవేత్త రాజ్ చంద్రాజీని స్మరించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ రాజ్ చంద్రాజీ స్ఫూర్తి, బోధనలను అచరిస్తున్నారని గుర్తుచేశారు.
ప్రధాని మోడీపై ఉప రాష్ట్రపతి ధన్ కర్ చేసిన కామెంట్లను కాంగ్రెస్, బీఎస్పీ ముక్తకంఠంతో ఖండించాయి. ఇంతకుమించి దిగజారి మాట్లాడటం మరొకటి ఉండదు. మోడీని గాంధీతో పోల్చడం సిగ్గుచేటు.. వ్యక్తి పూజకు ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటిపోయారు. స్థాయిని మరచి భజనపరుడిగా మారడం అవమానకరం.. ఇలాంటి వ్యాఖ్యలు పదవీకి విలువను జోడించవు అని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ విమర్శలు గుప్పించారు.
మరో విపక్ష పార్టీ బీఎస్పీ కూడా ఇదే రీతిలో స్పందించింది. కొత్త శకం ప్రారంభం కావడం నిజమే.. ఓ వర్గానికి చెందిన ఎంపీని దూషించేందుకు పార్లమెంట్లో అనుమతివ్వడం సరికాదు. దీంతో నిజంగానే ప్రధాని మోడీ కొత్త శకం ప్రారంభించారని బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
ధన్ కర్ అంతకుముందు బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. ఆ సమయంలో అక్కడి సీఎం మమతా బెనర్జీతో ఏదో కాంట్రవర్సీ ఉండేది. దీదీని గట్టిగా ఎదుర్కొన్నారనే కాబోలు.. మోడీ ప్రభుత్వం వైస్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేసింది.