కృష్ణా: పెనమలూరు మండలం గోసాల గ్రామంలోని రైతు బజార్ వద్ద నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కుమారుడు బోడే వెంకట్ రామ్‌కు కూటమి నేతలు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కూటమి నేతలతో కలిసి బోడే వెంకట్ రామ్ మొక్కలను నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడాలి ఆయన సూచించారు.