నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ, సాధారణ వృత్తి నైపుణ్య కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల 2025–26 ఉపకార వేతనాల దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగించినట్లు ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి దయానంద్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు www.telangana.epass వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.